Kamareddy: కామారెడ్డిలో ఎక్సైజ్ దాడులు 2 నెలల్లో 88 మంది అరెస్ట్

Kamareddy: కామారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం, గంజాయి అణచివేతకు ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు. రెండు నెలల్లో 294 కేసులు నమోదు చేసి 88 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి.

MADHU, KAMAREDDY
Published on: 7 Aug 2026 6:47 PM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డిలో ఎక్సైజ్ దాడులు 2 నెలల్లో 88 మంది అరెస్ట్

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం, డ్రగ్స్ అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని జిల్లా నిషేధ - ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి తెలిపారు. జూన్, జూలై నెలల్లో జిల్లా వ్యాప్తంగా చేసిన తనిఖీలు, దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు.

గత రెండు నెలల్లో శాఖ అధికారులు 294 కేసులు నమోదు చేసి 88 మందిని అరెస్ట్ చేశారు. దాడుల్లో 40.96 కిలోల గంజాయి, 125 లీటర్ల గుడుంబా, 7.5 లీటర్ల NDPS మద్యం, 33 లీటర్ల అక్రమ IML, 27 లీటర్ల దేశీ మద్యం, 28 లీటర్ల బీర్ స్వాధీనం చేసుకున్నారు.

107 కల్లు శాంపిల్లు సీజ్ చేయగా, 4,520 లీటర్ల పులియబెట్టిన పాకాన్ని ధ్వంసం చేశారు. 2 వాహనాలను కూడా సీజ్ చేశారు. బ్రౌన్ షుగర్ కేసుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story