Kamareddy: దళితులను మోసం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే: కాంగ్రెస్
Kamareddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దళితులను మోసం చేస్తున్నాయని కామారెడ్డి కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జ్ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ మీడియా సమావేశంలో విమర్శించారు.
Kamareddy: దళితులను మోసం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే: కాంగ్రెస్
Kamareddy: కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ బీజేపీ, బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. దళితులు, బలహీన వర్గాల పట్ల రెండు పార్టీల వైఖరి ఒకేలా ఉందని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను అవమానించేలా బీజేపీ–ఆర్ఎస్ఎస్ వ్యవహరించిందని విమర్శించారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ, మూడు ఎకరాల భూమి హామీ అమలు కాలేదని ప్రశ్నించారు. దళిత బంధు పథకం అమలుపైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితులు, బలహీన వర్గాలు, యువత, విద్యార్థులు సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏకమై కాంగ్రెస్‌కు అండగా నిలవాలని జహీర్ అక్తర్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భూమని బాలరాజ్, మండల అధ్యక్షులు రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.




