Kamareddy: కాటేపల్లిలో పదో తరగతి ప్రతిభావంతురాలైన విద్యార్థినికి బహుమతి
Kamareddy: కామారెడ్డి జిల్లా కాటేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థిని నందినికి రూ.11 వేల చెక్కు అందజేత.
Kamareddy: కాటేపల్లిలో పదో తరగతి ప్రతిభావంతురాలైన విద్యార్థినికి బహుమతి
కామారెడ్డి: కాటేపల్లి (కామారెడ్డి ) పెద్ద కొడప్ గల్ మండలం లొని కాటేపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 10 వ తరగతి లో ప్రథమ శ్రేణిలో ఉత్తిర్ణత సాధించిన విద్యార్థిని సాబ్లె నందినికి ప్రోత్సహకంగా కాగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లప్ప పాటిల్ 11 వేల విలువైన చెక్కును మంగళవారం అందజేశారు.
నందిని తరపున ఆమె తల్లి జైవంతి మధు షింగ్ చెక్కును స్వీకరించరు. ఈ సందర్బంగా విద్యార్థుల విజయాల్లో ప్రతి తల్లితండ్రుల పాత్ర ఎంతో కీలకమని మల్లప్ప పాటిల్ పేర్కొన్నారు. నందిని విజయంలో ఆమె తల్లి చూపిన ప్రోత్సహం అభినందనియమని జైవాంతిని శాలువాతో సన్మానించారు.
విద్యార్థులను ప్రోత్సహించడం, తల్లితండ్రులు, ఉపాధ్యాయుల సేవలను గుర్తించడం సమాజ అభివృద్ధికి దొహదా పడ్తుందని పేర్కొన్నారు. కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు టి. యాదవ్, మూడ్ శంకర్, ఆర్. లలిత, వి. సునీత, ఎం. సుజాత , ఎం. భక్షిరాం,జి. మంజుల,పి. అశోక్,దేవి దాస్ తోపాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.




