Jukkal: సర్పంచ్ అయినా ఆటో స్టీరింగ్ వదలని చండేగావ్ లక్ష్మణ్!

Jukkal: జుక్కల్ మండలం చండేగావ్ సర్పంచ్‌గా గెలిచినా తన ఆటో డ్రైవర్ వృత్తిని కొనసాగిస్తూ నిరాడంబరతతో ఆదర్శంగా నిలుస్తున్నారు బండేవార్ లక్ష్మణ్.

VEERANNA, JUKKAL
Published on: 13 Sept 2026 4:08 PM IST
Jukkal
X

Jukkal: సర్పంచ్ అయినా ఆటో స్టీరింగ్ వదలని చండేగావ్ లక్ష్మణ్!

జుక్కల్ (కామారెడ్డి ): ప్రజల ఆశీస్సులతో సర్పంచ్‌గా ఎన్నికైనా... నమ్ముకున్న వృత్తిని విడవని చండేగావ్ లక్ష్మణ్. చాలామంది ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత జీవనశైలిని మార్చుకుంటారు. కానీ జుక్కల్ మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని చండేగావ్ గ్రామ సర్పంచ్ బండేవార్ లక్ష్మణ్ మాత్రం అందుకు భిన్నమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నారు.

ప్రజల ఆశీస్సులతో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మణ్, నేటికీ తన నమ్ముకున్న ఆటో డ్రైవర్ వృత్తినేకొనసాగిస్తున్నారు. సర్పంచ్ కాకముందు ఆటో నడుపుతూ ఎంతోమందిని వారి గమ్యస్థానాలకు చేర్చిన ఆయన, అదే వృత్తితో వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించారు.

పదవి వచ్చిన తర్వాత కూడా ఆ వృత్తిని వదిలిపెట్టకుండా, ప్రజాసేవతో పాటు కష్టపడి పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అధికారం అనేది హోదా కోసం కాదని, ప్రజలకు సేవ చేయడమే అసలు బాధ్యత అని లక్ష్మణ్ తన జీవన విధానంతో చాటుతున్నారు.

"పదవి మారినా... వృత్తి మారలేదు. ప్రజల సేవలోనే జీవితం" అంటూ చండేగావ్ సర్పంచ్ బండే వార్ లక్ష్మణ్ కథ ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క యువకుడు ఆలోచించాల్సిన నిజమైన మనవీయ కథ.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL