Jukkal: ఉపాధి హామీ కాల్వ పనులు పరిశీలించిన ఎంపిఓ
Jukkal: జుక్కల్ మండలం లొంగన్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న కెనాల్ పనులను జుక్కల్ ఎంపీఓ, గ్రామ సర్పంచ్ కలిసి పరిశీలించారు.
Jukkal: ఉపాధి హామీ కాల్వ పనులు పరిశీలించిన ఎంపిఓ
Jukkal: లొంగన్ (కామారెడ్డి) ఉపాధి హామీ పథకం కింద చేపట్టుతున్న పనులను జుక్కల్ ఎంపి ఓ రాము పరిశీలించారు. సోమవారం జుక్కల్ మండలం లొంగన్ గ్రామంలో చేపట్టుతున్న కెనాల్ పనులను గ్రామ సర్పంచ్ ఉషారాణి సాధు పాటిల్, మాజి సర్పంచ్ తో కలిసి పరిశీలించారు. ఈ పనుల ద్వారా గ్రామంలోని వ్యవసాయ రైతులకు వర్షకాలంలో కెనాల్ ద్వారా పంట సాగు చేసేందుకు వీలుగా నీటి నిల్వ పెరిగి పంట సాగు కు అనుకూలంగా ఉంటుందని అన్నారు. వర్షకాలంలో వ్యవసాయానికి అవసరపడే పనులు చేయించడం జరుగుతుందని ప్రస్తుతం ఎండ తీవ్రత ను దృష్టిలో పెట్టుకొని కూలీలు సమయపాలన పాటించి ఉదయం పూట సకాలంలో పనులు పూర్తి చేసి 11 గంటల లోపు తమ తమ ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. పని చేసే చోట కూలీలకు అవసరమైన త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఫీల్డ్ అసిస్టెంట్ ను కోరారు.కూలీలందరు తిరిగి సాయంత్రం పూట పనులు చేయాలని పనికి తగిన కూలి డబ్బులు సకాలంలో చెల్లించే విధంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.




