Jukkal: కుమార్తె వివాహ విందు విజయవంతంపై ఎమ్మెల్యే తోట ధన్యవాదాలు!

Jukkal: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందు విజయవంతమైన సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే కుటుంబం ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపింది.

VEERANNA, JUKKAL
Published on: 16 Aug 2026 5:40 PM IST
Jukkal
X

Jukkal: కుమార్తె వివాహ విందు విజయవంతంపై ఎమ్మెల్యే తోట ధన్యవాదాలు!

జుక్కల్: జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా జుక్కల్ ఎమ్మెల్యే తన కుమార్తె జోనిట దాస్ వివాహ విందుకు బిచ్కుంద పట్టణంలోని డి బి ఎల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కుటుంబం తరపున ధన్యవాదములు తెలిపారు.

తన కూతుర్ని ప్రతి ఒక్కరు ఆశీర్వధించాలన్న ఆలోచన తో తను ప్రతినిధ్యం వహిస్తున్న జుక్కల్ నియోజకవర్గనికి కేంద్ర బిందువైన బిచ్కుంద పట్టణంలో వివాహ విందు ఏర్పాటు చెయ్యాలనే తన ఆలోచన కు సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కస్టపడి ఈ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తమ ఆహ్వానని మన్నించి వివాహ విందుకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలిపారు.ముఖ్యంగా తమ కుమార్తెను ఆశీర్వదించడానికి అధిక సంఖ్యలో హాజరైన ఆడబిడ్డలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story