Jukkal: జుక్కల్ ఎమ్మెల్యే కుమార్తె వివాహ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Jukkal: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందు ఘనంగా జరిగింది.

VEERANNA, JUKKAL
Published on: 16 Aug 2026 4:25 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్ ఎమ్మెల్యే కుమార్తె వివాహ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందు కార్యక్రమం బిచ్కుందలో నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని DBL ఆవరణలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జోనిట దాస్ ల వివాహ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపారు.వివాహ విందుకు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు. అభిమానులు బారులు తీరి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అంతా ప్రశాంత వాతావరణంలో జరిగింది.వచ్చిన అతిథులందరికీ ప్రత్యేక విందు ఏర్పాట్లు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ తన కుమార్తె దాంపత్య జీవితం సుఖంగా సాగాలని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.వివాహ విందు అనంతరం సీఎం అక్కడి నుండి బయలుదేరి వెళ్లగ ఆయన తో పాటు మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ అలీ,ఎంపీ సురేష్ శెట్కార్,నారాయణ్ ఖేడ్ సంజీవ్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా కాలెక్టర్ ఆశిష్ సంఘ్వన్, ఎస్పీ రాజేష్ చంద్ర, ఏ ఎస్ పి నర్సింహా రెడ్డి, డి ఎస్ పి లు, బాన్స్ వాడ ఆర్ డి ఓ లతోపాటు జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story