Jukkal: జుక్కల్‌లో వైభవంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
Jukkal: జుక్కల్ మండల కేంద్రంలో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జామియా మసీదు నుంచి భారీ ర్యాలీ, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
Jukkal: జుక్కల్‌లో వైభవంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి ) జుక్కల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జుక్కల్ మండల కేంద్రంలో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జామియా మజీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఖాతిజా మజీద్ వరకు కొనసాగి, తిరిగి జామియా మజీద్‌కుచేరుకుంది. అనంతరంఅన్నదానకార్యక్రమాన్నినిర్వహించారు.
ఈసందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన శాంతి, ప్రేమ,సోదరభావం,మానవత్వం,పరస్పరగౌరవంవంటివిలువలనుప్రతిఒక్కరూఆచరించాలనిపిలుపునిచ్చారు.
పవిత్రపర్వదినం సందర్భంగాప్రతికుటుంబంలోసుఖసంతోషాలు,శాంతి,ఐక్యత, ఆరోగ్యం, అభివృద్ధి నిండాలని, జుక్కల్ నియోజకవర్గప్రజలందరూ సుఖశాంతులతోజీవించాలనిఆకాంక్షించారు.
కార్యక్రమం లో మద్నూర్ మార్కెట్ కమిటి మాజి చైర్మన్ కె.సాయగౌడ్, బస్వపూర్ గ్రామ సర్పంచ్ భర్త డబ్ల్యూ. సురేష్ గొండ, డీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్, జుక్కల్ ఉపసర్పంచ్ షేక్ ఫిర్దోస్, మైనారిటీ అధ్యక్షులు షాదుల్, మిలాద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ షాఖిల్, మత పెద్దలు, చిన్నారులు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.




