Jukkal: జుక్కల్ ఎమ్మెల్యే తోటపై మాజీ ఎమ్మెల్యే షిండే ఫైర్!

Jukkal: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దసరా లోపు రోడ్డు పనులు పూర్తి చేయాలని బైఠాయించి నిరసన తెలిపారు.

VEERANNA, JUKKAL
Published on: 27 Aug 2026 5:34 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్ ఎమ్మెల్యే తోటపై మాజీ ఎమ్మెల్యే షిండే ఫైర్!

జుక్కల్: జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా... ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే, ఇక్కడి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని!" అంటూ ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విరుచుకుపడ్డారు. నాన్-లోకల్ కాకపోయినప్పటికీ ఎమ్మెల్యేగా గెలిపించిన జుక్కల్ ప్రజల రుణం తీర్చుకోకపోగా... కనీసం నడవడానికి రోడ్లు కూడా సరిగ్గా వేయించలేకపోతున్నారని మండిపడ్డారు. "జుక్కల్ మట్టికి, ఇక్కడి సమస్యలకు సంబంధం లేని వ్యక్తికి ఓటేసి గెలిపించినందుకు ప్రజలకు దక్కిన బహుమానం ఈ గుంతల రోడ్లేనా?" అని షిండే ప్రశ్నించారు.

​"ఓట్ల కోసం వచ్చి... ఊరుని వదిలేశారు": ఎన్నికల సమయంలో స్థానికుడు కాకపోయినా జుక్కల్ ప్రజలు గెలిపిస్తే గెలిచిన తర్వాత ఇక్కడి ప్రజల గోడు పట్టించుకోకుండా నియోజకవర్గాన్ని గాలికొదిలేశారని నిప్పులు చెరిగారు.​"స్థానికత లేని నాయకత్వం – శూన్యమైన అభివృద్ధి": కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా, స్థానికుడు కాని ఎమ్మెల్యేకు జుక్కల్ రైతులు, విద్యార్థులు, పడుతున్న ఇబ్బందులు ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు.​ రోడ్డు దుస్థితిపై R&B అధికారుల నుండి దసరా లోపు పనులు పూర్తి చేస్తామనే హామీ వచ్చేవరకు షిండే బైఠాయించి నిరసన తెలపడంతో నియోజకవర్గంలో రాజకీయం తీవ్ర వేడెక్కింది.

కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లి గంగాధర్, యూత్ అధ్యక్షుడు బాలాజీ,డబ్ల్యూ. మారుతీ,మాజి జెడ్పి టి సి పండరి,బిచ్కుంద సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ రావ్, బిచ్కుంద మార్కెట్ కమిటి మాజి చైర్మన్ నల్చర్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రావ్ దేశాయ్, మొహమ్మద బాద్ ప్రభు గొండ, మాజి సర్పంచ్ ఎల్. సాయిలు,ఎల్. రాములు, బంజారా సేవ సమితి అధ్యక్షుడు జాదవ్.రాజు, రెడ్డి బాలరాజ్, బాలాజీ పాటిల్, శ్రీకాంత్, ఎల్. నాగనాథ్, మల్కగొండ, శంకర్, జుక్కల్ మాజి కో ఆప్షన్ సభ్యుడు అన్వర్,కౌలస్ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షుడు మంత్రి ముదిరాజ్ సాయిలు, రాజేష్,విశ్వనాథ్ పంతులు,బొగ్గుల గంగాధర్,మాజి సర్పంచ్ లు, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story