Armoor: తెలంగాణలో జనసేన జెండా ఎగరడం ఖాయం: మీసాల శ్రీనివాస్!
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మెడికల్ అసోసియేషన్ హాల్లో జనసేన ఆత్మీయ సమావేశం.
Armoor: తెలంగాణలో జనసేన జెండా ఎగరడం ఖాయం: మీసాల శ్రీనివాస్!
ఆర్మూర్ (నిజామాబాద్): ఆర్మూర్ పట్టణ మెడికల్ డ్రగ్గిట్స్ & కెమిస్ట్స్ అసోసియేషన్ బిల్డింగ్ హాల్లో జనసేన పార్టీ ఆర్మూర్ నియోజవర్గ ఆత్మీయ సమావేశ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకుడు తో పాటు జిల్లా అధ్యక్షుడు, నియోజవర్గ కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాలో ఆగస్టు ఎనిమిదో తారీఖు నాడు అసెంబ్లీల నియోజవర్గ లకు సమావేశం నిర్వహించబడుతున్నది, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు, సిద్ధాంతలకు యువతలే కాకుండా, ఎంతో వయసు ఉన్న వారు కూడా , జనసేన పార్టీ వైపు ఈరోజు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో డబ్బులు సంపాదించే వ్యక్తి కాదు, డబ్బులు సంపాదించుకొని రాజకీయాల్లో వచ్చాడు, ఇప్పుడు కూడా డే టైం లో డిప్యూటీ సీఎం గా చేస్తూ, నైట్ టైం లో సినిమాలు చేస్తూ, అంత కష్టపడుతున్న వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్, ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీ లు ఏ రకంగా ఉన్నాయో అది గమనిస్తున్నారు, రానున్న కాలంలో జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో జెండాను ఎగరవేయడం ఖాయమంటూ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, ప్రవీణ్ ,రాము, కళ్యాణ్ గౌడ్, హరి వర్ధన్, అవినాష్ ,బండి రాము, గుండా సంతోష్ నేత, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




