Kamareddy: గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి!

Kamareddy: పెద్దకొడప్గల్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మీడియా సమావేశం. గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తీవ్ర విమర్శలు.

VEERANNA, JUKKAL
Published on: 15 Sept 2026 3:38 PM IST
Kamareddy
X

Kamareddy: గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి!

Kamareddy: పెద్ద కొడప్ గల్ (కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా జుక్కల్ బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గిరిజన ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

పెద్ద కొడప్ గల్ మండల కేంద్రం లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజి ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం లో మాజీ ముఖ్యమంత్రి కె సి ఆర్ నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లోని గిరిజన తండాలను పరిపాలన స్వలాభ్యం కోసం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్థానిక పాలనను ప్రజలకు చేరువ చేసిందన్నారు.

గిరిజన కుటుంబాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేసి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు అనేక హామీలు ఇచ్చినా వాటి అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టినఅభివృద్ధికార్యక్రమాలను కొనసాగించడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గిరిజన ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి,తక్షణమే వారిసమస్యలనుపరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే రోజుల్లో గిరిజన ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని హన్మంత్ షిండేఅన్నారు.కార్యక్రమం లో మాజి ఎంపి పి ప్రతాఫ్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ దేశాయ్, సతీష్ యాదవ్,జాదవ్ రాజు, చౌహన్ వినోద్, రామారావు నాయక్ లతోపాటు నియోజకవర్గం లొని గిరిజన నాయకులు, బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL