Jukkal: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై రేపు బీఆర్ఎస్ ధర్నా!
Jukkal: కేటీఆర్ పిలుపు మేరకు ఆగస్టు 18న జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ధర్నా. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిలిపివేతపై హన్మంత్ షిండే ఆగ్రహం.
Jukkal: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై రేపు బీఆర్ఎస్ ధర్నా!
Jukkal: జుక్కల్ (కామారెడ్డి ) కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిలిపివేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నాకార్యక్రమాలునిర్వహించనున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆగస్టు 18న జుక్కల్ నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
పేద కుటుంబాలకు అండగా నిలిచే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ధర్నా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హన్మంత్ షిండేపిలుపునిచ్చారు.




