Armoor: ఆర్మూరులో కనుల పండువగా వాసవి జయంతి ఉత్సవాలు

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

VAMSHI, ARMOOR
Published on: 26 April 2026 8:22 PM IST
Armoor
X

Armoor: ఆర్మూరులో కనుల పండువగా వాసవి జయంతి ఉత్సవాలు

ఆర్మూర్ న్యూస్: శ్రీ వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో, వైశ్య సంఘం, కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు, సంఘం కుటుంబాలతో అంగరంగ వైభవంగా ఘనంగా అర్చకులు రాజగోపాల్ చారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది.

వాసవి అమ్మవారి జన్మదిన సందర్భంగా:

ఈ జన్మ దిన సందర్భంగా ఆలయంలో ఉదయం 7:30 A. M. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, 9:00 A. M. హారతి,10:00 A. M డోలోత్సవం, 10:30 A. M. సంఘ మహిళలతో 1000 నామాల కుంకుమతో సామూహిక సహస్రనామ పారాయణం. అనంతరం అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమం.

సంఘ & ఆలయ అధ్యక్షుల:

ఈ సందర్భంగా సంఘ & ఆలయ అధ్యక్షులు మాట్లాడుతూ జై వాసవి మాత, కన్యకా పరమేశ్వరి వాసవి మాత అమ్మవారి జన్మదినం దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించబడినది, ఆ కార్యక్రమాల తర్వాత వాసవి మాత భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు, సంఘ భక్తులకు అమ్మవారి యొక్క కృప దయ దీవెనలతో అందరూ ఆయురారోగ్యాల, సుఖ సంతోషాలతో ఎల్లవేళలా మంచిగా ఉండాలని, ఆ వాసవి మాతాని కోరుతూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంఘ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఈ.సీ. మెంబర్ పోలా సుధాకర్, వైశ్య సంఘ అధ్యక్షుడు తమ్మి శ్రీనివాస్, ఆలయ అధ్యక్షుడు అంభిరీష్, నాగేశ్వర దేవాలయ అధ్యక్షుడు, రిపోర్టర్ అల్లాడి.వంశీకృష్ణ, సంఘ మహిళ అధ్యక్షులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story