Bodhan: అక్బర్ నగర్‌లో వైభవంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం!
Bodhan: బోధన్ అక్బర్ నగర్ చెరకు పరిశోధన కేంద్రంలో శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది.
Bodhan: అక్బర్ నగర్‌లో వైభవంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం!
Bodhan: డివిజన్ పరిధిలోని అక్బర్ నగర్ ప్రాంతీయ చేరుకు మరియు వారి పరిశోధన స్థానం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని గణనీయంగా నిర్వహించారు. మఖ నక్షత్ర యుక్త మితునాలగ్న పుష్కరాంశమున శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని పేద పండితులు నిశాంత్ పంతులు,
బ్రహ్మశ్రీ శ్రీనివాస శర్మ విష్ణు శర్మ రోహిత్ శర్మ బ్రహ్మశ్రీ రామరాజు జోషి గార్లచే యజ్ఞకం తో స్వాముల వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి శ్రీ శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ మల్లారం స్వామి భక్తులకు హిందూ ధర్మంపై ప్రవచనలు చేశారు. స్వాములవారి కళ్యాణానికి బోధన్ డివిజన్లోని వివిధ ప్రాంతాల నుండి సతీష్ సమేతంగా భక్తులు కళ్యాణానికి తరలివచ్చారు.
పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు : ప్రతి ఏడు వైశాఖ శుద్ధ దశమి పురస్కరించుకొని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వాముల కళ్యాణాన్ని ప్రజలు పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ప్రతి ఏడు లాగే పరిశోధన కేంద్రం అధిపతి పవన్ చంద్ర రెడ్డి భక్తులకు భోజన వసతి తో పాటు విద్యుత్ అలంకరణను నిర్వహించారు. ఈ కళ్యాణం లో సిబ్బంది శంకర్, సాయిలు, సిబ్బంది పాల్గొన్నారు.




