Kamareddy: రోడ్డుపై పారబోసిన రూ. 15 లక్షల విలువైన ప్రభుత్వ మందులు!
Kamareddy: కామారెడ్డి జిల్లా రామేశ్వర్పల్లిలో రోడ్డు పక్కన భారీ మొత్తంలో ప్రభుత్వ మందులు పారబోత. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మినీ డీసీఎం వ్యాన్ సీజ్.
Kamareddy: రోడ్డుపై పారబోసిన రూ. 15 లక్షల విలువైన ప్రభుత్వ మందులు!
Kamareddy: కామారెడ్డి జిల్లా రామేశ్వర్పల్లిలో ప్రభుత్వం సరఫరా చేసే మెడిసిన్ రోడ్డుపై కలకలం రేపింది. నేషనల్ హైవే రోడ్డు పక్కన భారీ మొత్తంలో మెడిసిన్ పారబోస్తుండగా.. భిక్కనూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా భిక్కనూరు మండలంలోని బస్వాపూర్, రామేశ్వర్పల్లి శివారులో కొంత మంది మెడిసిన్ పారబోస్తున్నారు.
పారబోసిన మెడిసిన్ విలువ సుమారు 15 లక్షల వరకు ఉంటుంది. పారబోసిన మెడిసిన్ కాల పరిమితి కలిగి ఉండడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. భిక్కనూర్ మెడికల్ ఆఫీసర్ యేమిమా పోలీసులకు సమాచారం అందించారు. మెడిసిన్ పారబోస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మెడిసిన్ పారబోసిన మినీ డీసీఎం వ్యాన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత కొద్ది నెలలుగా ప్రభుత్వం సరఫరా చేసే కాలపరిమితి గల మెడిసిన్ రోడ్లపై పారబోస్తుండటంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.




