Bichkunda: కొత్త విద్యార్థులకు ఘన స్వాగతం.. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు!

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

VEERANNA, JUKKAL
Published on: 10 Sept 2026 7:01 PM IST
Bichkunda
X

Bichkunda: కొత్త విద్యార్థులకు ఘన స్వాగతం.. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు!

బిచ్కుంద: బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఆత్మీయంగా వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కే. అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బిచ్కుంద మున్సిపల్ చైర్‌పర్సన్ సీమ శెట్కర్, వైస్ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగాహాజరయ్యారు.

కౌన్సిలర్లు చిన్న మారుతి,దర్పల్ కార్తీక, కుర్కుటె శ్యామల, జాదవ్ నౌష నాయక్, కో-ఆప్షన్ సభ్యులు, సీపీడీసీ సభ్యులు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతంలో సకల సౌకర్యాలతో అభివృద్ధి చెందుతున్న కళాశాలలోని వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అతిథులు సూచించారు.

క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలనిఆకాంక్షించారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.కళాశాల ప్రిన్సిపాల్ కే. అశోక్ మాట్లాడుతూ.. కళాశాల సాధిస్తున్న ప్రగతి, విద్యార్థులు సాధిస్తున్న విజయాలను అతిథులకు వివరించారు. విద్యార్థుల కలలు, ఆశయాలు, లక్ష్య సాధనకు అధ్యాపక బృందం ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు.

కళాశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.ఈసందర్భంగా తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకుడు కే.విజయభాస్కర్ రెడ్డి విద్యార్థులందరికీ భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ఉత్సాహభరిత ప్రదర్శనలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story