Nizamabad: యువతకు ఉచిత పోలీస్ శిక్షణ ప్రకటించిన సిపి!
Nizamabad: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ. ఈనెల 23న స్క్రీనింగ్ టెస్ట్ అని సీపీ సాయి చైతన్య వెల్లడి.
Nizamabad: యువతకు ఉచిత పోలీస్ శిక్షణ ప్రకటించిన సిపి!
Nizamabad: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సి.పి సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూడు డివిజన్లలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు.
Next Story




