Banswada: నిజామాబాద్ జిల్లాలో దారుణం మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు దారుణ హత్య!

Banswada: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటేశ్వర్లు వ్యవసాయ పొలం వద్ద దారుణ హత్యకు గురయ్యారు.

SALEEM, BANSWADA
Published on: 25 Aug 2026 4:21 PM IST
Banswada
X

Banswada: నిజామాబాద్ జిల్లాలో దారుణం మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు దారుణ హత్య!

Banswada: తగిలేపల్లి శివారులోని వ్యవసాయ పొలం వద్ద మైసమ్ వెంక వెంకటెశ్వర్లు తల పై పదునైన ఆయుధంతో దాడి చేశారని తీవ్ర రక్త స్రావం కావడంతో అక్కడే మృతి చెందాడని సిఐ కృష్ణ తెలిపారు.ప్రక్క ప్రక్కన ఉన్న పొలం తగాదాల వల్లే బక్క నారాయణ అతని కుమారులు కలిసి , నా భర్తను హత్య చేశారని భార్య రుకుం బాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

గతంలో వెంకటెశ్వర్లు ఎంపిటిసి ఉన్నప్పుడు నిందితుడు బక్క నారాయణ ఉప సర్పంచ్ గా పని చేశారు అప్పటి నుండి కొన్ని కారణాల వల్ల రాజకీయ కక్షలు పే పెరుగాయి.రాజకీయ కక్షలు,భూ వివాదం వెంకటెశ్వర్లు ప్రాణం తీసింది.వెంకటెశ్వర్లు ఒకసారి ఎంపిటిసి 2 పర్యాయాలు సర్పంచిగా పని చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిందితున్ని త్వరలో పట్టుకుంటామని సిఐ కృష్ణ తెలిపారు.మృత దేహాన్ని పోస్ట్ మార్టం కొరకు బోధన్ ఆసుపత్రికి తరలించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story