Jukkal: జుక్కల్‌లో వారం రోజుల పాటు బీఆర్‌ఎస్ నిరసనలు!

Jukkal: కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు జుక్కల్ నియోజకవర్గంలో వారం రోజుల పాటు నిరసనలు చేపట్టనున్నట్లు హన్మంత్ షిండే తెలిపారు.

VEERANNA, JUKKAL
Published on: 1 Sept 2026 10:55 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్‌లో వారం రోజుల పాటు బీఆర్‌ఎస్ నిరసనలు!

జుక్కల్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు.

హెచ్‌ఎం టీవీ డిజిటల్‌తో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 7వతేదీవరకునియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాల్లోప్రత్యేకకార్యక్రమాలునిర్వహించనున్నట్లువెల్లడించారు.

సెప్టెంబర్ 2న ఆరు గ్యారంటీల వైఫల్యంపై జుక్కల్మండలకేంద్రంలోనిరసనకార్యక్రమంనిర్వహించనున్నట్లు తెలిపారు. 3న వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై పిట్లం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టనున్నట్లుపేర్కొన్నారు.4నవృద్ధులు,వికలాంగులు,మహిళలతోనిజాంసాగర్,మొహమ్మద్‌నగర్ మండల కేంద్రాల్లోప్రత్యేకసదస్సులునిర్వహించనున్నట్లుతెలిపారు.

5న గ్రామ పారిశుద్ధ్యం, గ్రామాల అభివృద్ధిపై బిచ్కుంద పట్టణంలో కార్యక్రమంచేపట్టనున్నట్లుచెప్పారు. 6న ప్రజావాణికార్యక్రమంలో వినతిపత్రాలు సమర్పించడంతో పాటునియోజకవర్గంలోని ప్రతిమండల కేంద్రంలో నిరసనకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు షిండే తెలిపారు. చివరి రోజైన సెప్టెంబర్ 7న నియోజకవర్గ కేంద్రమైన జుక్కల్ మండల కేంద్రంలోని డాక్టర్.బీ.ఆర్. అంబేద్కర్ వి గ్రహానికి వినతిపత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వవిఫలపాలననుఎండగట్టేందుకుచేపట్టనున్నఈవారంరోజులనిరసనకార్యక్రమాల్లోనియోజకవర్గంలోని ప్రతి గ్రామం, గిరిజన తండా నుంచి యువకులు, మహిళలు, బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులుపెద్దసంఖ్యలోపాల్గొనికార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేపిలుపునిచ్చారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story