Kamareddy: ఏ ఒక్క కార్యకర్త, ప్రజాస్వామ్యవాది ఓటు తొలిగిపోకుండా చూడాలి
Kamareddy: మాచారెడ్డి లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి, 267 బూత్‌లలో ఓటర్ల జాబితా ప్రక్షాళనపై కీలక సూచనలు చేశారు.
Kamareddy: ఏ ఒక్క కార్యకర్త, ప్రజాస్వామ్యవాది ఓటు తొలిగిపోకుండా చూడాలి
కామారెడ్డి: ఏ ఒక్కరి ఓటు తొలిగిపోకుండా ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతగా చూడాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం మాచారెడ్డి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సర్ ఓటర్ ప్రక్షాళన భాగంగా చేస్తున్న విధుల్లో పలు సూచనలు తెలియజేశారు.
కామారెడ్డి నియోజకవర్గం లో 267 బూతుల్లో ప్రతి ఒక్కరు ఓటు పోకుండా చూడాలని, అలాగే డిజిటల్ పూర్తయ్యే వరకు చూడాలన్నారు. ఎవరైనా ఓటు తొలిగిపోతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాల్సిందిగా సూచించారు.
గ్రామాలలో 90% పైగా హోటల్ ప్రక్రియ పూర్తయిందని పట్టణాల్లో కొంచెం మెల్లగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పొన్నాల శ్రీకాంత్ రెడ్డి బాలచంద్రం బూస శీను కిషన్ కృష్ణారెడ్డి మహేష్ అంజి నాయక్ హనుమాన్లు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.




