Banswada: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి తీవ్ర విమర్శలు!

Banswada: కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో బీఆర్ఎస్ ధర్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎమ్మెల్యే.

SALEEM, BANSWADA
Published on: 6 Sept 2026 3:45 PM IST
Banswada
X

Banswada: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి తీవ్ర విమర్శలు!

Banswada: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పై కే టీ ఆర్ ఆదేశాల మేరకు బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

అడవులు తగ్గిపోవడంతో అప్పుడు కేసీఆర్ హరితహారం కింద నర్సరీ లు ఏర్పాటు,పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్నారు మాజి ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ అన్నారు, ప్రజల గౌరవం కోసం స్మశాన వాటికలు ఏర్పాటు చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో హరితహారాన్ని పల్లె ప్రకృతి వనాన్ని, స్మశాన వాటికలను గాలికి వదిలేసి మళ్లీ పాత కాంగ్రెస్ రోజులను గుర్తు చేస్తుందని అన్నారు.

కేసీఆర్ హయంలో జాతీయ అవార్డులు పొందడం జరిగిందని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 13వ స్థానంలో ఉందని ,అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.సీఎం రేవంత్ తమ్ముళ్లు ఏమైనా సర్పంచ్ ,ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్లా వాళ్లకు ఎందుకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని బాజీ రెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story