Nizamabad: పెళ్లింట విషాదం.. కూతురు వివాహం చేసిన రోజే తండ్రి ఆత్మహత్య!

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదం. కూతురు పెళ్లి చేసిన రోజే తండ్రి ఆత్మహత్య.

K RAVI, BODHAN
Published on: 28 April 2026 10:18 AM IST
Nizamabad
X

Nizamabad: పెళ్లింట విషాదం.. కూతురు వివాహం చేసిన రోజే తండ్రి ఆత్మహత్య!

Nizamabad: అప్పటివరకు పెళ్లి సందడి జరిగిన ఇంట్లో మరణ వార్త తీరని విషాదాన్ని మిగిల్చింది. కూతురు పెళ్లి చేసిన ఆనందం ఒక గంట కూడా లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నందిగామ గ్రామంలో కూతురు పెళ్లి చేసిన రోజే తండ్రి ఆత్మహత్య ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. నువ్వు పెట్టేసేయ్ శ్రీకాంత్ తెలిపిన వివరాలు ప్రకారం ఎలుక దేవన్న 51 మేకల పెంపకం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా నస్లాబాద్ మండలం అంకోల్ గ్రామానికి చెందిన వరుడు శివకుమార్ కు ఇచ్చి తన ఏకైక కూతురు ప్రవళికను ఆదివారం వివాహం జరిపించాడు.

కూతురు పెళ్లి ఖర్చులకోసం 130 మేకల్లో 30 మేకల విక్రయించి ఘనంగా వివాహం జరిపించిన దేవన్న ఇంటికి వచ్చి మేకల మంద ను చూసి మందలో 30 మేకలు తగ్గినట్టు కనిపించడంతో తీవ్ర మనస్థాపానికి గురై మద్యం సేవించిన దేవన్న ఇంట్లో ఉరువేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. దేవన్నకు ఇద్దరు కుమారులు ఒక కూతురు సంతానం ఉన్నారు. ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు మానసిక వికలాంగుడు దేవన్న మృతి పట్ల గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story