Nizam Sagar: నిజాంసాగర్‌లో విషాదం.. నీటికుంటలో పడి రైతు దుర్మరణం!

Nizam Sagar: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

VEERANNA, JUKKAL
Published on: 9 Sept 2026 7:20 PM IST
Nizam Sagar
X

Nizam Sagar: నిజాంసాగర్‌లో విషాదం.. నీటికుంటలో పడి రైతు దుర్మరణం!

నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లో విషాద ఘటనచోటుచేసుకుంది.హసన్‌పల్లి గ్రామానికి చెందిన సుంకేసాయిలు (38) అనేరైతు ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగిమృతిచెందాడు. బుధవారం ఉదయం తమపొలానికి నీరు అందించేందు కువెళ్లిన సాయిలు గ్రామ పరిధిలోని బోయినోళ్ల జాలకుంట తూము వద్దప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే నీటిలోకి దిగి సాయిలును బయటకు తీశారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లుగుర్తించారు.ఈ ఘటనతో హసన్‌పల్లి గ్రామంలో విషాదఛాయలుఅలుముకున్నాయి. మృతుడి భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాంసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story