Bodhan: నో పార్కింగ్ లో బైక్ పెట్టొద్దన్నందుకు దారుణం.. కోర్టులోనే అటాక్!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులో నో పార్కింగ్ వివాదం ఘర్షణకు దారితీసింది.

K RAVI, BODHAN
Published on: 16 May 2026 11:49 AM IST
Bodhan
X

Bodhan: నో పార్కింగ్ లో బైక్ పెట్టొద్దన్నందుకు దారుణం.. కోర్టులోనే అటాక్!

నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలోని న్యాయస్థానంలో కోర్టు సిబ్బందిపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బోధన్ పట్టణ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ సర్దార్ సింగ్ బోధన్ కోర్టుకు వచ్చారు. కోర్టు ఆవరణలో ద్విచక్ర వాహనాన్ని నో పార్కింగ్ వద్ద నిలపడంతో కోర్టు సిబ్బంది నరేందర్ వాహనాన్ని పక్కకు తీయాలని సూచించారు. ఇరువురి మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో కోర్టు సిబ్బంది నరేందర్ పై సర్దార్ సింగ్ దాడి చేయడంతో విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ హెచ్ ఓ బాధితుడు ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ పరిశీలించి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఎక్స్ సర్వీస్ మెన్ కు రిమాండ్ కు తరలించాలని జడ్జి ఆదేశించడంతో ఎక్స్ సర్వీస్ మెన్ సారంగ పూర్ జైలుకు తరలించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story