Bichkunda: బస్సు ప్రమాద బాధితులకు మాజి ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శ
Bichkunda: కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు.
Bichkunda: బస్సు ప్రమాద బాధితులకు మాజి ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శ
బిచ్కుంద ( కామారెడ్డి ): జుక్కల్ చౌరస్తాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రిలోచికిత్సపొందుతున్న బాధితులను కలిసివారిఆరోగ్య పరిస్థితినిఅడిగితెలుసుకున్నారు.
ఈసందర్భంగా ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందడం పట్ల హన్మంత్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో మాజి మార్కెట్ కమిటి చైర్మన్ నల్చర్ రాజు,జుక్కల్ మాజి జెడ్పి టి సి. కె. పండరి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లి గంగాధర్, బిచ్కుంద మండల అధ్యక్షుడు వెంకట్ రావ్ దేశాయ్, జుక్కల్ వష్రె. రమేష్,మాజి వైస్ ఎంపి పి రాజు పాటిల్, అశోక్ పాటిల్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.




