Bichkunda: హెచ్‌ఎంటీవీ కథనానికి స్పందన.. బిచ్కుందలో తీరిన నీటి సమస్య!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద 6వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యపై హెచ్‌ఎం టీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించి బోరు మోటార్ ఏర్పాటు చేశారు.
Bichkunda: హెచ్‌ఎంటీవీ కథనానికి స్పందన.. బిచ్కుందలో తీరిన నీటి సమస్య!
బిచ్కుంద: బిచ్కుంద మండల కేంద్రంలోని 6వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యపై హెచ్‌ఎం టీవీ డిజిటల్ న్యూస్‌లో ఈ నెల 21న ప్రసారమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులనుపరిష్కరించేందుకు 6వ వార్డులో బోర్ మోటార్‌ను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను తీర్చారు.
“అధికారులు ప్రజా సమస్యలు తీరుస్తారా.. నాయకుల కనుసన్నల్లో పని చేస్తారా?” అనే అంశంపై హెచ్‌ఎం టీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన హెచ్‌ఎం టీవీకి కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Next Story




