Kamareddy: మడమ నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు: ప్రముఖ వైద్యుల హెచ్చరిక!
Kamareddy: పాదం, మడమ సమస్యలకు ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని కామారెడ్డి యశోద ఓపీ సెంటర్లో డాక్టర్ ఆదిత్య సోమయాజులు వెల్లడించారు.
Kamareddy: మడమ నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు: ప్రముఖ వైద్యుల హెచ్చరిక!
కామారెడ్డి జిల్లా: కేంద్రంలోని యశోద ఓపీ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ ఆదిత్య సోమయాజులు... పాదం, మడమ చికిత్సలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య విధానాలను వివరించారు.
ఆధునిక స్కానింగ్ పద్ధతులతో సమస్యను ఖచ్చితంగా గుర్తించి... రోగికి అవసరమైన చికిత్స అందించవచ్చని తెలిపారు. ఇన్వేసివ్ సర్జరీలు, అత్యాధునిక ఇంప్లాంట్లు, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో క్లిష్టమైన పాద గాయాలు, ఎముక విరుగుళ్లు, పాద వికృతులకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉందన్నారు.
అవసరమైతే యాంకిల్ జాయింట్ రీప్లేస్మెంట్తో నడకను మెరుగుపరచవచ్చని తెలిపారు.
పాదం లేదా మడమ నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా... ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Next Story




