Jukkal: డోన్‌గావ్‌లో 80వ స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన సర్పంచ్!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం డోన్‌గావ్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్.
Jukkal: డోన్‌గావ్‌లో 80వ స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన సర్పంచ్!
Jukkal: జుక్కల్ (కామారెడ్డి ) జుక్కల్ మండలం డోన్‌గావ్ గ్రామంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఉప సర్పంచ్ హన్మగొండ, ఏఈఓ జి. శ్రీలేఖ (రజిత) కార్యక్రమంలో పాల్గొని త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పలువురు వక్తలు పేర్కొన్నారు. దేశ సమగ్ర అభివృద్ధి, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
మండలవ్యాప్తంగా ఉత్సాహంగా వేడుకలు.
డోన్‌గావ్‌తో పాటు జుక్కల్ మండలంలోని వివిధ గ్రామాల్లోనూ 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.బస్వాపూర్ లో సర్పంచ్ రమణ సురేష్ గొండ, జుక్కల్ లో సావిత్రి సాయాగౌడ్, పెద్ద ఎడ్గి లో మండల విద్యాశాఖాధికారి తిరుపతి తోపాటు ఆయా గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
వివిధ గ్రామాల్లో స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకుంటూ వారి త్యాగాలను కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. దీంతో జుక్కల్ మండలంలోని గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో ఉత్సాహభరితంగా సాగాయి.




