Banswada: పేద విద్యార్థినులకు డాక్టర్ సంతోష్ రెడ్డి రూ.60 వేల ఆర్థిక సాయం!

Banswada: హైదరాబాద్‌లో కోర్సు చదువుతున్న నెమలి గ్రామానికి చెందిన పేద విద్యార్థినులకు రూ.60 వేల ఆర్థిక సాయం అందించిన డాక్టర్ సంతోష్ రెడ్డి.

SALEEM, BANSWADA
Published on: 28 Aug 2026 5:42 PM IST
Banswada
X

Banswada: పేద విద్యార్థినులకు డాక్టర్ సంతోష్ రెడ్డి రూ.60 వేల ఆర్థిక సాయం!

Banswada: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నెమలి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు బండి కావేరి, చిట్టి మానసలకు బాన్సువాడ పట్టణానికి చెందిన అన్విత హాస్పిటల్ డాక్టర్ సంతోష్ రెడ్డిMD. శుక్రవారం ఆర్థిక సహాయం అందించి వారికి అండగా నిలిచి,పెద్ద మనస్సును చాటుకున్నారు.

హైదరాబాద్‌లోని దోమలగూడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో UGDPED రెండేళ్ల కోర్సులో చదువుతున్న విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన ఖర్చుల కోసం రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. క్రీడారంగంలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు డాక్టర్ సంతోష్ రెడ్డి ముందుకు రావడంపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువుకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ సంతోష్ రెడ్డి కి క్రీడాకారుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story