Nizamsagar: ఎన్ సి డి స్క్రినింగ్ పై ఆరోగ్య సిబ్బంది తో సమీక్ష!

Nizamsagar: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బందితో డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటి సమీక్ష సమావేశం నిర్వహించారు.

VEERANNA, JUKKAL
Published on: 18 Aug 2026 5:21 PM IST
Nizamsagar
X

Nizamsagar: ఎన్ సి డి స్క్రినింగ్ పై ఆరోగ్య సిబ్బంది తో సమీక్ష!

నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని నిజాంసాగర్, పిట్లం, మొహమ్మద్‌నగర్ మండలాలకు చెందిన ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది, పర్యవేక్షకులతో మంగళవారం గోర్గల్ పంక్షన్ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా వైద్యాధికారి డా. వెంకటి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.ముఖ్యంగా గర్భిణీల నమోదు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, ఎన్‌సీడీ స్క్రీనింగ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య తదితర అంశాలపై ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందిని కార్యక్రమాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆయా కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సిబ్బందికి జిల్లా వైద్యాధికారి సూచించారు. ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సేవలు మరింత చేరువయ్యేలా సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఆరోగ్య కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

సమావేశంలో డా. రోహిత్ కుమార్, ఐ/సీ డీఐఓ, ఇన్‌చార్జ్ మెడికల్ ఆఫీసర్ డా. షోయల్,హెచ్‌ఈఓలువెంకటనా రాయణ, మధుసూధన్, భూమయ్యతో పాటు సంబంధిత హెల్త్ సూపర్‌వైజర్లు, జిల్లా వైద్యారోగ్య సిబ్బంది సిద్దు, గౌస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story