Nizamabad: ధరణి ఆపరేటర్ల తొలగింపు ఎఫెక్ట్!

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో 66 మంది ధరణి, కంప్యూటర్ ఆపరేటర్ల తొలగింపు. బోధన్, రుద్రూర్ పరిధిలో నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు. ఇబ్బందుల్లో రైతాంగం.

K RAVI, BODHAN
Published on: 16 July 2026 12:08 PM IST
Nizamabad
X

Nizamabad: ధరణి ఆపరేటర్ల తొలగింపు ఎఫెక్ట్!

Nizamabad: జిల్లాలో ధరణి ఆపరేటర్లను తొలగించడంతో ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ధరణి ఆపరేటర్లతో రెవెన్యూ శాఖలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న ఆపరేటర్లను తొలగిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ కావడంతో నిజామాబాద్ జిల్లాలో 33 మంది ధరణి ఆపరేటర్లు, 33 మంది కంప్యూటర్ ఆపరేటర్లను అధికారులు తొలగించారు.

ఫలితంగా జిల్లా వ్యాప్తంగా వివిధ రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆపరేటర్ లేకపోవడంతో ఆయా మండలాల్లో డిప్యూటీ తాసిల్దార్లు, జూనియర్ అసిస్టెంట్లు కంప్యూటర్ పనులను కొనసాగిస్తున్నారు.

ఆపరేటర్లు తొలగింపు పై భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. బోధన్ డివిజన్లో ని ఆయా మండలాల్లో ఆపరేటర్ లేకపోవడంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

జిల్లా స్థాయి అధికారులు వెంటనే ఆపరేటర్లను నియమించాలని లేని పక్షాన ప్రత్యామ్నాయ పద్ధతి ద్వారా సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను రైతులు వేడుకుంటున్నారు. ఈ విషయమై రుద్రూర్ తారాబాయి బోధన్ విట్టల్, తాసిల్దార్లను సంప్రదించగా పైనుంచి ఆదేశాలు వచ్చేవరకు తాము రిజిస్ట్రేషన్ చేయలేమని ఇచ్చారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story