Nizamabad: రెంజల్ ఆదర్శ పాఠశాల వద్ద బీజేపీ ధర్నా!

Nizamabad:రెంజల్ మోడల్ స్కూల్ ఎదుట బీజేపీ ధర్నా. సంతకాల ఫోర్జరీ, అవినీతికి పాల్పడిన ప్రిన్సిపాల్ ఫిరోజ్.

K RAVI, BODHAN
Published on: 5 Aug 2026 4:06 PM IST
Nizamabad
X

Nizamabad: రెంజల్ ఆదర్శ పాఠశాల వద్ద బీజేపీ ధర్నా!

Nizamabad: రెంజల్ మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ప్రిన్సిపాల్ ఫిరోజ్ హైదర్ ను వెంటనే విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రిన్సిపల్ పలువురు సంతకాలు పోర్జరీ చేసినట్లు స్వయంగా ఒప్పుకున్నప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో రాజకీయం చేయరాదని ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యార్థులు ఆందోళనకు దిగితే కేంద్ర విద్యా శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

సుదర్శన్ రెడ్డి గారు ఎవరి ఒత్తిళ్ల వల్ల కాపాడుతున్నారని అయన విమర్శించారు. అవినీతికి పాల్పడినటువంటి ప్రిన్సిపాల్ ఫెరోజ్ హైదర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తనను సస్పెండ్ చేసే వరకు బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఖ్యాతం యోగేష్, సంతోష్ నాయకులు మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story