Nizamabad: యువత క్రీడల్లో రాణించాలి.. ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Nizamabad: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులస్‌పూర్‌లో క్రికెట్ టోర్నమెంటును ఎస్ఐ సుస్మిత, ఎంఆర్ఓ రేఖ ప్రారంభించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 25 April 2026 3:04 PM IST
Nizamabad
X

Nizamabad: యువత క్రీడల్లో రాణించాలి.. ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Nizamabad: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులస్ పూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంటు గ్రామ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, మోపాల్ SI సుస్మిత, మోపాల్ MRO రేఖ కలసి ప్రారంభించారు. టోర్నమెంట్లో 80 టీంలు పాలుగోన్నాయని సర్పంచ్ తెలిపారు. తమ గ్రామంలో ప్రతి ఏటా యువతకు క్రీడ పోటీలు నిర్వహించి బహుమతులు మరియు ప్రోత్సాహకంగా నగదును అందజేస్తామని సర్పంచ్ తెలిపారు.

ఈ టోర్నమెంటు లో గెలిచినా మొదటి విన్నర్ టీం కి 10,000 రూపాయలు, రన్నర్ టీం కి 5,000 నగదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. టోర్నమెంట్లో రాణించిన మంచి ప్లేయర్ కి ప్లేయర్ అఫ్ ది టోర్నమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. క్రీడలు ఆడడంతోనే మానసిక శారీరక దృఢత్వం ఏర్పడుతుందని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు.

యువత చెడు అలవాట్లకు, వ్యసనాలను అలవర్చుకోకుండా క్రీడలు దోహతా పడతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో SI సుస్మిత MRO రేఖ కులస్పూర్ సర్పంచ్ జనార్దన్ రెడ్డి ఉప సర్పంచ్ కోర్వ మహిపాల్ వార్డ్ సభ్యులు,పంచాయతీ కార్యదర్శి,గ్రామ పంచాయతీ కారోబార్, గ్రామ అభివృద్ధి కమిటి సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ పాలకవర్గం యువత పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story