Banswada: సీపీఎస్ రద్దు కోసం ఈ నెల 23న 'చలో హైదరాబాద్': పోస్టర్ ఆవిష్కరణ

Banswada: ఈ నెల 23న చేపడుతున్న "చలో హైదరాబాద్" బహిరంగ సభ పోస్టర్లను బాన్సువాడ జూనియర్ కళాశాలలో ఉద్యోగ నాయకులు ఆవిష్కరించారు.

SALEEM, BANSWADA
Published on: 12 Aug 2026 7:09 PM IST
Banswada
X

Banswada: సీపీఎస్ రద్దు కోసం ఈ నెల 23న 'చలో హైదరాబాద్': పోస్టర్ ఆవిష్కరణ

బాన్స్వాడ: ప్రభుత్వ ఉద్యోగుల ను CPS నుండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోనికి మార్చాలని.. డిమాండ్ చేస్తూ "చలో హైదరాబాద్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ భట్టు విఠల్ కోరారు.బాన్సువాడ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశమై ఆయన మాట్లాడుతూ నెల 23 న భారీ బహిరంగ సభ పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ భట్టు విఠల్ పిలుపు నిచ్చారు.

కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోసం చేపట్టిన భారీ బహిరంగ సభలో ప్రతీ cps ఉద్యోగి బాధ్యతతో పాల్గొనాలని కోరారు .ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల లను సాధించుకోవడానికి ప్రభుత్వం పై ఒత్తిడి చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు.

"ఒక్కరైతే ఒంటరే అని అందరూ ఒక్కటైతే ఉప్పెనే అని ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తున్నట్లు జూనియర్ కళాశాలల కన్వీనర్ యాదగౌడ్ , నర్సింలు, రామేశ్వర్ తదితరులు హెచ్చరించారు . అనంతరం చలో హైదరాబాద్ పోస్టర్లు ను ఆవిష్కరించారు. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ సాధించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పొందడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. CPS ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం.

Cps ఉద్యోగుల భవిష్యత్తు కోసం సామాజిక భద్రత కోసం కదం కదం కలిపి లక్షలాదిగా తరలిరండి అని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్ నాయకులు అసిస్టెంట్ ప్రోఫేసర్లు వినయ్ కుమార్,శంకర్ రావు యాదగౌడ్, కామారెడ్డి నాయకులు నర్సింలు, రామేశ్వర్ అంకం విష్ణు. అధ్యక్షులు. నీలం నర్సింలు అధ్యక్షులు మరియు యాదవ్ గౌడ్. శ్రీనివాస్. రమేష్ రావ్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story