Bichkunda: సీఎం రాకతో బిచ్కుందలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు!

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

VEERANNA, JUKKAL
Published on: 12 Aug 2026 5:47 PM IST
Bichkunda
X

Bichkunda: సీఎం రాకతో బిచ్కుందలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు!

Bichkunda: బిచ్కుంద (కామారెడ్డి ) జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణంలో ఈ నేల 16 న జరుగనున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కుమార్తె వివాహ విందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం కామారెడ్డి జిల్లా కాలెక్టర్ ఆశిష్ సంఘ్వన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, డి, సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఏ ఎస్పీ నర్సింహా రెడ్డి, బాన్స్ వాడ ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి, డి ఎస్ పి. విట్టల్ రెడ్డి కలిసి హెలిప్యాడ్ ఏర్పాట్లు, వివాహ వేదికను పర్సిలించారు.

ముఖ్యమంత్రి రాక సందర్బంగా భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, అతితుల రాకపోకలు, పార్కింగ్ సదుపాయాలపై అధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్ ల్యాడింగ్ ప్రాంతాన్ని పర్సిలించి అవసరమైన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జుక్కల్ లో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాజకీయ, పరిపాలన వర్గాల్లో చురుకుదనం పెరిగింది.

వివాహ విందుకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరు కనున్నారు. కార్యక్రమం లో నియోజకవర్గం లొని సర్పంచ్లు,మార్కెట్ కమిటి చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, మునిసిపల్ కౌన్సిలర్లు,అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story