Bodhan: బోధన్‌లో లారీ అదుపుతప్పి కారు, బైక్‌ను ఢీకొంది
Bodhan: నిజామాబాద్ బోధన్‌లో సిమెంట్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో కారు, బైక్‌ను ఢీకొట్టింది. ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
Bodhan
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లారీ అదుపు తప్పి ముందుగా ఉన్న కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం TS 05 UC 8595 నంబర్ గల సిమెంట్ లారీకి బ్రేకులు సరిగా పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ముందుగా కారు ను ఢీకొట్టిన లారీ, అనంతరం ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారునికి స్వల్ప గాయాలు కాగా, కారు మరియు బైక్‌కు నష్టం జరిగింది.
లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ప్రమాద సమయంలో రహదారిపై ఇతర వాహనాలు లేకపోవడం, కారు అధిక వేగంలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




