Banswada: రుద్రూరులో బీఆర్ఎస్ ధర్నా కళ్యాణలక్ష్మి పునరుద్ధరణకు డిమాండ్!
Banswada: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని రుద్రూరు బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ధర్నా. ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయకుండా కుట్ర చేసిందని ఆరోపణ.
Banswada: రుద్రూరులో బీఆర్ఎస్ ధర్నా కళ్యాణలక్ష్మి పునరుద్ధరణకు డిమాండ్!
Banswada: కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ ను కొనసాగించాలనీ రుద్రూరు లో BRS పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని BRS మండల ఇంచార్జి గాండ్ల మధు అన్నారు.కల్యాణ లక్ష్మి అంశంలో హైకోర్టు లో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేసిందనీ,
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందనీ మండల ఇంచార్జి గాండ్ల మధు మండిపడ్డారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలని పేర్కొన్నారు. తెలంగాణలో
అయితే ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కల్యాణలక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేసారు.
కల్యాణలక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా మండిపడ్డారు. నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని నిలదీశారు.
హైకోర్టు తీర్పును ఇప్పుడు సాకుగా చూపుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా నిలిపివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఇప్పటికే కేసీఆర్ హయాంలో అమలైన పలు సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసిన కాంగ్రెస్, ఇప్పుడు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లను కూడా రద్దు చేయాలని చూస్తోందని విమర్శించారు.
.ఈ కార్యక్రమం లో మండల ఇంచార్జి గాండ్ల మధు, బి ఆర్ ఎస్ సినియర్ నాయకులు గజేందర్, డౌడ్ సాయిలు, శానం పోశెట్టి,అల్లావుద్దీన్ వoజరి గోపి, నరేందర్,బందెల శేఖర్,సుమన్, పార్వతి ప్రవీణ్,సాయికిరణ్, సాయగౌడ్,చందపాషా తదితరులు పాల్గొన్నారు.




