Bodhan: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రెంజల్‌లో BRS రాస్తారోకో!
Bodhan: రెంజల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పణ.
Bodhan: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రెంజల్‌లో BRS రాస్తారోకో!
Bodhan: రెంజల్ మండల కేంద్రంలో మండల కేంద్రంలోకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మండల మండలంలోని వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో టిఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసే ఆలోచనలో ఉందని ఆరోపిస్తూ, పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ, నవీపేట్ ఆధ్వర్యంలో రెంజెల్ MRO గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదని కోరారు. పథకాలను కొనసాగిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేశారు.
ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వికార్ పాషా,మండల వివిధ గ్రామాల టిఆర్ఎస్ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు.




