Banswada: హామీల అమలుపై బాన్సువాడ ఆర్డీఓకు బీఆర్‌ఎస్ వినతి!
Banswada: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్ నేతలు.
Banswada: హామీల అమలుపై బాన్సువాడ ఆర్డీఓకు బీఆర్‌ఎస్ వినతి!
Banswada: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు,420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బాన్సువాడ పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు,మాజీ ఎమ్మెల్యే,మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి,అర్హులైన ప్రతి పేద వారికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని కోరారు.
అలాగే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు, రైతులకు రుణభారం నుంచి ఉపశమనం,రైతు కూలీలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మహిళలకు హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయాలని వినతి పత్రంలో కోరారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని, హామీల అమలులో జాప్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అంజిరెడ్డి, మోరల్ శ్రీనివాస్ రావు,బాడీ శ్రీనివాస్,మోచి గణేష్,అక్బర్,ఇసాక్, కౌన్సిలర్లు ఖలీల్,ఫెరోజ్, మాక్బూల్,మొగులన్న,షఫీ,అతీఫ్,కాసుల బాబు,ఖాలేద్,అఫ్జల్, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.




