Bodhan: బోధన్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ. పోటాపోటీ నిరసనలతో తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగ ప్రవేశం.
Bodhan: బోధన్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆరు గ్యారెంటీ లపై నిరసన తెలుపడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసేందుకు తరలివచ్చారు.
ఇదే సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేసేందుకు కాంగ్రెస్ నాయకులు సైతం చౌరస్తా చేరుకున్నారు. ఇరు పార్టీలు పోటాపోటీగా నిరసనలు తెలుపుతున్న సమయంలో టిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లకార్డు ను ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన కార్యకర్త ఫ్లక్కార్డు ను లాక్కునేందుకుప్రయత్నం చేస్తూ బిఆర్ఎస్ నాయకులపై కి దూసుకెళ్లారు. దీంతో బోధన్ లో ఇరు పార్టీ ల మధ్య ఘర్షణ వాతావరణం చో టు చేసుకుంది.
శాంతియుతంగా చేపట్టాల్సిన నిరసనలు రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతకు దారితీయడంతో కొద్దిసేపు గలాటా జరిగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఇరు పార్టీల నాయకులను కార్యకర్తలను చదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు.




