Bodhan: బోధన్‌లో 'యంగ్ ఇండియా' పాఠశాల పనులు వేగవంతం చేయాలి!

Bodhan: బోధన్ బేలాల్ శివారులో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి.

K RAVI, BODHAN
Published on: 22 July 2026 3:54 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో 'యంగ్ ఇండియా' పాఠశాల పనులు వేగవంతం చేయాలి!

Bodhan: ఇంటిగ్రేటే డ్ పాఠశాల నిర్మాణం పై ప్రభుత్వ సలహాదారు అధికారలరుల తో బేలాల్ శివారు లో పేద విద్యార్థుల కోసం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం పై ఈ ఎన్ సీ అధికారులతో కలిసి వివిధ శాఖ ల అధికారులతో ప్రభుత్వసలహాదారు సుదర్శన్ రెడ్డి సమీక్షా నిర్వహించారు. బుధవారం వివిధ శాఖ ల అధికారులతో కలిసి పాఠశాల నిర్మాణం పనుల పరిశీలన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సుమారు.

రూ.2వందలకోట్ల నిధులతో 20 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటి డ్ పాఠశాల ను నిర్మాణం చేపడుతున్నామాని ఆయన అన్నారు. పేద విద్యార్థుల కు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే దిశగా ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. బోధన్ ప్రాంతంలో బాలికలు అత్యధికంగా విద్యనభ్యసిస్తున్నారని ముందుగా వారికే ఎంగినే పాఠశాలలో ప్రాధాన్యత కల్పించినట్లు రాష్ట్ర యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల కోఆర్డినేటర్, ప్రభుత్వ సలహా గారు సుదర్శన్ రెడ్డి అన్నారు.

వచ్చే ఏడాదిన్నర కాలంలో పాఠశాల నిర్మాణం పూర్తి చేసి 2500 మంది బాలికలకు ఐదో తరగతి నుండి ఇంటర్ వరకు ఈ పాఠశాలలో అవకాశం కల్పించనున్నామని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పాటిపడుతున్నారని అందులోనే పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ముందుగా తన నియోజకవర్గంలోని పనులు త్వరితగతను పూర్తి చేసి లక్ష్యం చేరే దిశగా పనిచేయాలి పని చేయాలన్నారు. ఆయన వెంట మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహెర్ బీన్ హందాన, గంగ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story