Bodhan: బోధన్‌లో స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగి ప్రమాదం.. తప్పిన ముప్పు

Bodhan: బోధన్ బండారుపల్లి వద్ద స్టీరింగ్ రాడ్డు విరిగి పొలాల్లోకి దూసుకెళ్లిన యూనికాన్ స్కూల్ బస్సు. విద్యార్థులు సురక్షితం. ఫిట్‌నెస్‌పై విద్యార్థి సంఘాల ఫిర్యాదు.

K RAVI, BODHAN
Published on: 1 July 2026 3:31 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగి ప్రమాదం.. తప్పిన ముప్పు

బోధన్: మండలం లోని బండారు పల్లి శివారులో ప్రైవేట్ పాఠశాల బస్సు స్టీరింగ్ పని చేయక పోవడం తో అదుపు తప్పింది. బోధన్ పట్టణం లోని శక్కర్ నగర్ ప్రాంతం లోని యూనికాన్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థుల ను పాఠశాల కు తీసుకుని వచ్చే క్రమంలో స్టీరింగ్ రాడ్డు విరిగి పోవడం తో ఒక్కసారిగా బస్సు పక్కనే ఉన్న పంటపొలాల వద్దకు దూసుకెళ్ళింది.

ఈ సమయం లో బస్సులో విద్యార్థులు ఉన్నపటికీ డ్రైవర్ చాక చక్యం గా వ్యవహరించి బస్సు ను అదుపు చేయడం తో విద్యారులకు పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లి దండ్రులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థుల ను సురక్షితం గా బయటకు తీసుకుని ద్విచక్ర వాహనాల పై వారి వారి ఇళ్లలోకి తీసుకెళ్లారు.

పాఠశాల యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా వెను వెంటనే బస్సు ను అక్కడి నుండి తరలించారు.ఈ విషయమై రూరల్ ఎస్ ఐ రాజశేఖర్ ను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు.

విద్యార్థి సంఘాల ఆందోళన: ఫిటినెస్ లేని బస్సుల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు పీడీ ఎస్ గౌతమ్, మీసాల నాగేష్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్ నెస్ లేని వాహనాల మూలంగా విద్యార్థుల ప్రాణాల కు హాని ఉంటుందని ఈ విషయమై బోధన్ ఆర్టివో అశ్వంత్ కు పిర్యాదు చేశారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story