Bodhan: ప్రభుత్వ ఆస్పత్రిలో గంజాయి మత్తులో వీరంగం.. ఎస్హెచ్ఓ, కానిస్టేబుల్‌పై దాడి
Bodhan: బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో గంజాయి మత్తులో దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన బోధన్ పోలీసులు.
Bodhan: ప్రభుత్వ ఆస్పత్రిలో గంజాయి మత్తులో వీరంగం.. ఎస్హెచ్ఓ, కానిస్టేబుల్‌పై దాడి
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గంజాయి మత్తులో వీరంగం సృష్టించిన ఇద్దరు వ్యక్తులు బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ తో పాటు కానిస్టేబుల్ క్రాంతి పై దాడికి పాల్పడ్డారు.
ఎస్ ఎస్ ఓ తెలిపిన వివరాల ప్రకారం కోపర్గా గ్రామానికి చెందిన రామన్న సాయిలు, బండారి వినయ్ శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు.
విషయం తెలుసుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందిన అందించడంతో అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ క్రాంతితోపాటు సిబ్బంది ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
పోలీస్ స్టేషన్లో సైతం ఎస్ హెచ్ ఓ తొడపై గాయం చేయడంతో పాటు క్రాంతివేలును విరగొట్టారు. గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారణ చేపట్టి శనివారం సాయంత్రం ప్రభుత్వ వైద్యుల విధులకు ఆటంకపరచడంతో, పోలీసు విధులకు సైతం అడ్డుకున్నాడంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ ఓవెల్లడించారు.




