Bodhan: అందాపూర్‌లో దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన.. పునరావాసానికి తరలింపు

Bodhan: బోధన్ మండలం అందాపూర్‌లో వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన సర్పంచ్ గంగాధర్. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని హామీ.

K RAVI, BODHAN
Published on: 30 July 2026 6:14 PM IST
Bodhan
X

Bodhan: అందాపూర్‌లో దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన.. పునరావాసానికి తరలింపు

బోధన్: బోధన్ మండలం అందాపూర్ గ్రామంలో గత రెండు రోజులుగా తలుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించారు.

గురువారం సర్పంచ్ గంగాధర ఆధ్వర్యంలో శిధిలావస్థకు చేరిన ఇండ్లను పరిశీలించి అటీలలో నివాసం ఉంటున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి బాసట కల్పించారు.

వర్షబావ పరిస్థితి తు ల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు.

గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల్లో చిక్కుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాన్నారు. వార్డు సభ్యులు రాజు, సుధాకర్, సమీర్, డిసిసి ప్రధాన కార్యదర్శి పల్లన్న, కార్యదర్శి రంజిత్ , జిపిఓ కిరణ్ గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story