Bodhan: వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీవో విజయ కుమారి!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బాలికల కళాశాల వసతి గృహంతో పాటు ఎస్సీ, బీసీ హాస్టళ్లను ఆర్డీవో విజయ కుమారి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

K RAVI, BODHAN
Published on: 21 July 2026 9:32 PM IST
Bodhan
X

Bodhan: వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీవో విజయ కుమారి!

బోధన్: బోధన్ పట్టణమ్ లోని బాలికల కళాశాల వసతి గృహం తో పాటు, ఎస్సీ, బీసీ వసతి గృహాలను బోధన్ ఆర్డివో విజయ కుమారి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థుల కు అందిస్తున్న మెనూ పై ఆరా తీశారు.

బాలికల వసతి గృహల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని వార్డెన్ లకు సూచించారు. వార్డెన్ లు ఏళ్ల వేళల అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాలని ఆమె వెల్లడించారు. ఆమె వెంట తాసీల్దార్ విట్టల్, ఉన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story