Bodhan: బక్రీద్ వేళ వదంతులు నమ్మొద్దు.. పోలీసులకు సహకరించండి: సీపీ సాయి చైతన్య

Bodhan: బోధన్ పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సమావేశం. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పాల్గొని ప్రజలకు, మత పెద్దలకు కీలక సూచనలు చేశారు.

K RAVI, BODHAN
Published on: 7 May 2026 7:36 PM IST
Bodhan
X

Bodhan: బక్రీద్ వేళ వదంతులు నమ్మొద్దు.. పోలీసులకు సహకరించండి: సీపీ సాయి చైతన్య

బోధన్: ప్రశాంత వాతావరణం లో బక్రీద్ పండగ ను జరుపుకోవాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. బోధన్ పట్టణం లోని లయన్స్ క్లబ్ లో గురువారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సోదరా భావం తో ప్రశాంత వాతావరణం లో పండగ ను జరుపుకోవాలన్నారు. అసత్య ప్రచారాలు, సోషల్ మీడియా లో వచ్చే వదంతులను నమ్మ వద్దన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.

శాంతి సామరస్యానికి పోలీసులు పాటుపడుతున్నారని అందుకు ప్రజల నుండి పూర్తి సహకారాలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రార్థన స్థలాల వద్ద ప్రత్యేక పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తామని అందుకు మైనార్టీ మత పెద్దలు సైతం సహకరించాలన్నారు. ఈ కమిటీలో డిసిపి శుభం ప్రకాష్, బోధన్ ఎసిపి శ్రీనివాసరావు, పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ, రూరల్ సీఐ విజయబాబు మీద పోలీస్ స్టేషన్లో ఎస్సైలు పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story