Bodhan: బోధన్ సంతాన నాగమ్మ ఆలయంలో ఘనంగా నాగుల పంచమి
Bodhan: బోధన్ ఏకచక్రేశ్వర నగర్‌లోని సంతాన నాగమ్మ ఆలయంలో నాగుల పంచమి పూజలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి హాజరు, అన్నదానం నిర్వహణ.
Bodhan: బోధన్ సంతాన నాగమ్మ ఆలయంలో ఘనంగా నాగుల పంచమి
Bodhan: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర నగర్ వద్ద నాగుల పంచమి పండుగను ఘనంగా నిర్వహించారు. సోమవారం పంచాక్షరి సందర్భంగా సంతాన నాగమ్మ ఆలయం వద్ద కు భక్తులు భారీ సంఖ్యలో చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోశారు.
కోరిన కోరికలు తీర్చే సంతాన నాగమ్మ వద్ద మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు మొక్కుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.
Next Story




