Bodhan: అథ్లెటిక్స్‌లో బోధన్ గురుకుల విద్యార్థుల జోరు!

Bodhan: నిజామాబాద్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బోధన్ మైనార్టీ గురుకుల విద్యార్థులు నవీన్, సయ్యద్, విష్ణు ప్రతిభ.

K RAVI, BODHAN
Published on: 14 July 2026 1:39 PM IST
Bodhan
X

Bodhan: అథ్లెటిక్స్‌లో బోధన్ గురుకుల విద్యార్థుల జోరు!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ మైనార్టీ గురుకుల విద్యార్థులు గోల్డ్ మేడల్ కు ఎంపికైనట్లు గురుకుల ప్రిన్సిపల్ ఇంతి యాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆథ్లెటిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈ అథ్లెటిక్స్ లో బోధన పట్టణంలోని మైనార్టీ గురుకుల విద్యార్థులు క్రీడల్లో పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు.

ఈ పోటీల్లో రాష్ట్రస్థాయికి క్రీడాకారులు ఎంపిక అవ్వడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ తోపాటు పీఈటి ఏంబరి సందీప్, సుధాకర్ లు క్రీడాకారులను ప్రశంసించి సత్కరించారు. 1000 మీటర్ల నుండి 1500 వరకు పరుగు పందెంలో పాల్గొని రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలో ఎంపికైన క్రీడాకారులు బంగారుపథకాలు సాధించడం పట్ల పాఠశాల తో పాటు బోధన్ విద్యాసంస్థలు అభిందించాయి. ఎంపికైన వారిలో నవీన్ టెన్త్ క్లాస్,సయ్యద్ టెన్త్ క్లాస్లు చదువుతున్న క్రీడాకారులు గోల్డ్ మెడల్ పొందారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విష్ణు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు ప్రకటించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story