Bodhan: జెసిబి ఢీకొని ధ్వంసమైన రైల్వే గేట్.. భారీగా ట్రాఫిక్ జామ్
Bodhan: బోధన్‌లో జెసిబి ఢీకొనడంతో రైల్వే గేట్ సెన్సార్ బాక్స్ ధ్వంసమైంది దీంతో సుమారు 45 నిమిషాల పాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Bodhan: జెసిబి ఢీకొని ధ్వంసమైన రైల్వే గేట్.. భారీగా ట్రాఫిక్ జామ్
నిజామాబాద్
బోధన్
కన్నే రవి
బోధన్ పట్టణంలోని ప్రకాష్ పెట్ రైల్వే స్టేషన్ సమీపంలో గల రైల్వే గేటును జెసిబి ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ జామైంది. జెసిబి డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా రైల్వే గేటు సెన్సార్ బాక్స్ కు ఢీకొంది. అదే సమయంలో తిరుపతి రాయలసీమ రైలు స్టేషన్‌కు వస్తున్న సమయంలో గేటును దింపేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నించగా గేటు పడకపోవడంతో తాడు సహాయంతో ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు. గేటుకు మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించగా గేటు దిగకపోవడంతో మరమ్మతులు చేయించాలని సూచించారు. దీంతో సుమారు 45 నిమిషాల పాటు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
Next Story




