Bodhan: బోధన్ స్కానింగ్ సెంటర్‌పై పోలీసులకు డీఎంహెచ్‌వో ఫిర్యాదు!
Bodhan: బోధన్‌లోని శ్రీ కృష్ణ స్కానింగ్ సెంటర్‌లో నిబంధనల ఉల్లంఘనను ప్రశ్నించిన డీఎంహెచ్‌వో రాజశ్రీపై నిర్వాహకుడు దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదైంది.
Bodhan: బోధన్ స్కానింగ్ సెంటర్‌పై పోలీసులకు డీఎంహెచ్‌వో ఫిర్యాదు!
Bodhan: బోధన్ పట్టణంలోని పలు స్కానింగ్ సెంటర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ తనిఖీలు చేశారు. తనిఖీలు భాగంగా గురువారం పట్టణంలోని శ్రీ కృష్ణ స్కానింగ్ సెంటర్లు కనీసం నిబంధనలు పాటించడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ విషయమై స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను హెచ్చరించగా సదరు వైద్య ఆరోగ్య శాఖ అధికారిని పట్ల నిర్వాహకుడు దురుసుగా మాట్లాడడంతో పాటుఅమర్యాదగా ప్రవర్తించాడని డిఎంహెచ్వో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో కాసేపు సదర అధికారినితో పాటు నిర్వాకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
వెంటనే పోలీసులకు సమాచారం అందించి సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రాజశ్రీ పోలీసులకు సూచించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పట్టణ ఎస్ హెచ్ఓ వెంకట్ నారాయణ వివరించారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్తామని రాజశ్రీ పేర్కొన్నారు.




